ప్రపంచయాత్రకు సై అంటున్న కుక్క
ఫరెగ్జాంపుల్.. మీరు ప్రపంచపటాన్ని ఎదురుగా పెట్టుకుని యథాలాపంగా ఓ చోట వేలు పెట్టి సెలక్టు చేశారనుకోండి. మహా అయితే ఏమవుతుంది? ఆ ప్రదేశం తాలూకు బొమ్మలను, వీడియోలను మీరు య్యూట్యూబ్లోకి వెళ్లి చూసి ఆనందించవచ్చు. అంతకు మించి.. వేలు పెట్టిన ప్రతి చోటూ వెళ్లి చూసి రావాలంటే.. సాధ్యం కాదు. కానీ ఆ కుక్క గారి సంగతి అలా కాదు. ఏడాదికోమారు.. తన ఎదురుగా ఉండే ప్రపంచపటంలో అది ఎక్కడ కాలు పెడితే ఆ ప్రదేశానికి అది అధికారికంగా వెళ్లి పర్యటించి వస్తుంది. తన సహాయకుడితో కూడా! సహాయకుడు అంటే మరో కుక్క కాదు సుమండీ.. ఒక మనిషి. అవును మరి.. ఏ కుక్కకైనా తన బ్యాంకు ఖాతాలో 993,700 అమెరికన్ డాలర్లు ఉన్నట్లయితే అలాంటి వైభోగమే సాగుతుంది.
వివరాల్లోకి వెళితే.. రష్యా వద్ద బెలారెస్ లోని బుడోచ్కా గ్రామానికి చెందిన జాన్ ఫ్యోడోరోప్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో సెటిలయ్యాడు. ఆయనకు వాలెట్ అనే కుక్క ఉండేది. ఓ సందర్భంలో దానికి జబ్బు చేసింది. చికిత్స గురించి జాన్ పట్టించుకోకపోవడంతో అది మరణించింది. తన నిర్లక్ష్యం వల్లనే అది మరణించిందని పశ్చాత్తాపపడ్డ ఫ్యోడోరోవ్ 2007లో బుడోచ్కా గ్రామానికి వెళ్లినప్పుడు.. అక్కడ వాసిలీ పొటాపోవ్కు చెందిన జూలిక్ అనే కుక్కను చూశాడు. అది అచ్చం 1950లలో చనిపోయిన తన వాలెట్‌నే పోలి ఉన్నదని చెప్పాడు. దానిని ఆదరించడం ద్వారా తన తప్పునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఫ్యోడోరోవ్ అనుకున్నాడు.
ఆయన విల్లులోని చివరి కోరిక మేరకు.. ఆయన ఆస్తుల్లోంచి పైన చెప్పిన మొత్తంతో జులిక్ పేరిట లాయరు మరియా బ్యాంకు అకౌంటు ప్రారంభించారు. పైన పేర్కొన్న వసతులన్నీ ఆ కుక్కకు ఏర్పాటయ్యాయి. అది ప్రపంచ పర్యటనకు వెళ్లినప్పుడెల్లా.. దాని ప్రస్తుత యజమాని వాసిలీ పొటాపోవ్ కూడా వెళ్తుంటారన్నమాట.
అదీ కథ!
More Telugu News
-
'పీరియడ్స్ ఆగవు కదా'.. మహిళల సవాళ్లపై చర్చ రేకెత్తించిన పర్వతారోహకురాలి వీడియో!
-
ఆటగాడిగా వచ్చి.. ఇప్పుడు కోచ్‌గా.. ముంబై ఇండియన్స్ పగ్గాలు పొలార్డ్ చేతికి
-
నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వైసీపీ హైకోర్టులో పిటిషన్
-
అల్లూరి జిల్లాలో పేలుడు ప్రమాదం.. ఐదుగురి మృతి
-
డైటింగ్‌తో తగ్గిన బరువు మళ్లీ పెరుగుతోందా? అసలు ఎందుకు అలా జరుగుతుంది?
-
శాంతికి మెలానియా ట్రంప్ చొరవ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం
-
సిద్దిపేటలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఏడుగురి అరెస్ట్
-
బ్రిటిష్ గుండెల్లో వణుకు.. ‘ఫౌజీ’లో ప్రభాస్ పాత్ర ఏంటో తెలిసిపోయింది.. టీజర్ చూశారా?
-
అదంతా డ్రామా.. భర్త వచ్చేశాడంటూ బాంబు పేల్చిన రీనా రాజ్‌పుత్!
-
అద్భుతం.. 23 దేశాలు చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్లు!
-
చైనా గస్తీ తీరుతో సరిహద్దుల్లో అలజడి.. కేంద్రం కీలక ప్రకటన
-
కివీస్ పేసర్ల దెబ్బకు ఇండియా-ఎ కుదేల్.. 113 పరుగులకే ఆలౌట్!
-
లైవ్ రిపోర్టింగ్‌లో ప్రమాదం.. సముద్రం ప్రమాదకరం అని చెబుతుండగానే జర్నలిస్ట్‌ను ముంచెత్తిన భారీ కెరటం.. ఇదిగో వీడియో!
-
ఉదయాన్నే జీలకర్ర నీరు తాగడం మంచిదేనా?.. నిపుణుల సూచనలివే!
-
కాంగ్రెస్‌ను డెమొక్రాట్లు గెలిస్తే.. ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు: ట్రంప్ హెచ్చరిక

{{title}}
{{#tmb100}} {{/tmb100}}